సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏలూరులో ఓటింగ్‌ సందడి.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు

01 నవంబర్, 2026

a23a7838-7b82-4edd-b72a-14d9b8dd0311.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 09:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – ఏలూరు సిటీ : ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. నగరంలోని వివిధ డివిజన్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు ఉత్సాహంగా కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. నగరంలోని 62 డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు మేయర్ ఎన్నిక కోసం పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎన్నికల నిబంధనలు అమలయ్యేలా భద్రతా చర్యలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్