మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గోల్డ్ లోన్ మోసం - ముగ్గురు బ్యాంకు అధికారులు అరెస్ట్

09 సెప్టెంబర్, 2026

Gold loan fraud – Three bank officials arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 02:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ మోసం కేసులో ముగ్గురు బ్యాంకు అధికారులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మాజీ బ్రాంచ్ మేనేజర్ కుమారపు భాస్కరరావు, జాయింట్ మేనేజర్ తన్నేరు అజయ్‌బాబు, క్రెడిట్ ఆఫీసర్ జంగల సాయిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులోని నూట డెబ్బై ఆరు గోల్డ్ లోన్ ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. సుమారు ఆరు కిలోల నాలుగు వందల నలభై తొమ్మిది గ్రాముల బంగారం మాయమైనట్లు, దాని విలువ దాదాపు పది కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్