సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - ప్రయాణీకులు అవస్థలు

31 ఆగస్టు, 2026

Goods train derails – Passengers face hardship
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 10:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉంగుటూరు (ఏలూరు జిల్లా) : నిడదవోలు - కొవ్వూరు మధ్య పసివేదలలో సోమవారం అప్ లైన్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే పలు ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద పాసింజర్ రైలు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. సోమవారం కావడంతో డ్యూటీ కోసం విజయవాడ నుండి కాకినాడకు వెళ్లే ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ట్రైన్ నిలిపివేయడంతో జాతీయ రహదారి మీదకు చేరుకున్న ప్రయాణీకులు ఆటోలు, కారు బస్సుల్లో ఎక్కి గమ్యస్థానాలకు చేరుకునేందుకు అవస్థలుపడ్డారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్