శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

46వ డివిజన్‌లో 144 సెక్షన్ - పోలీసుల కవాతు

6 రోజుల క్రితం

police kavatu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 04:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రోడ్లపై జనసంచారానికి అనుమతి లేదు.. నిబంధనలు

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు


ప్రజాశక్తి-ఏలూరు సిటీ : ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ... ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక 46వ డివిజన్‌లో డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా కవాతు నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసు సిబ్బందితో డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారులు, వీధుల్లో మార్చ్‌ఫాస్ట్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోడ్లపై గుమిగూడిన ప్రజలను పోలీసులు ఇళ్లలోకి వెళ్లాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున రోడ్లపై గుంపులుగా ఉండకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చినా, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని పోలీసులు సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్