గుండెపోటుతో భర్త కోటగిరి సతీష్ (53) ఆకస్మిక మృతి
ప్రజాశక్తి – నూజివీడు టౌన్ : నూజివీడు పట్టణంలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిని కోటగిరి పూర్ణిమ ఇంట ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త కోటగిరి సతీష్ (53) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, మరోవైపు అభ్యర్థిని కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా విచారం వ్యక్తమైంది. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సతీష్ మృతికి సంతాపం తెలిపారు. కోటగిరి పూర్ణిమ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.







కామెంట్‌లు (0)