శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జంగారెడ్డిగూడెంలో కాలం చెల్లిన మత్తు ఇంజెక్షన్ల కలకలం

1 గంట క్రితం

Uproar over expired sedative injections in Jangareddygudem.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 11:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

జంగారెడ్డిగూడెం (ఏలూరు) : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కాలం చెల్లిన మత్తు ఇంజెక్షన్ల గుట్టును డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్లు రట్టు చేశారు. స్థానిక డాంగేనగర్‌లోని ఓ కార్పెంటరీ దుకాణంలో దాచిన 7,550 ట్రెమడాల్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని లక్ష్మీ శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు కిశోర్ తన వద్ద కాలం చెల్లిన మత్తు ఇంజెక్షన్లు లేవని, వాటిని డంపింగ్ యార్డులో ధ్వంసం చేసినట్లు అధికారులను తప్పుదోవ పట్టించారు. తనిఖీలు జరిగితే ఎవరికీ దొరక్కుండా .. డాంగేనగర్‌లోని తన స్నేహితుడి కార్పెంటర్‌ దుకాణంలో భద్రపరిచాడు. సోదాలు నిర్వహించిన అధికారులు 7,550 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు పట్టణంలోని భవాని మెడికల్స్ నిర్వాహకుడు మరో 3 వేల ఇంజెక్షన్లను విక్రయించినట్లు తేలిందని డ్రగ్ ఇన్స్పెక్టర్లు మల్లికార్జునరావు, అబిద్ ఆలీ తెలిపారు. కాలం చెల్లిన మత్తు ఇంజెక్షన్ల విక్రయాలకు పాల్పడిన రెండు ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో డాక్టర్ శోభ పరిశీలించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ట్రెమడాల్ ఇంజెక్షన్లు సరఫరా లేదని ఆమె స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్