మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ. 2 లక్షలతో ట్రాన్స్ ఫార్మర్ మార్చేందుకు పనులు ప్రారంభం

1 గంట క్రితం

Work has begun to replace the transformer at a cost of Rs 2 lakh.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉంగుటూరు (ఏలూరు జిల్లా) : నారాయణపురం- భీమవరం ఆర్ అండ్ బి రహదారి నారాయణపురం బజారులో జనాల రద్దీ మధ్యలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మార్చేందుకు విద్యుత్ శాఖ అధికారులు నిధులు కేటాయించారు. నారాయణపురం బజారులో ప్రమాదకరంగా ఉన్న 100 కెవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు ఆ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. వంతెన సమీపంలో దిమ్మ కట్టేందుకు జెసిబి తో పనులు చేయిస్తున్నామని ఏ ఈ శ్రీరామ్ మంగళవారం పేర్కొన్నారు. ఇక్కడ పనిలో పూర్తి అవ్వగానే బజారులో ట్రాన్స్ఫార్మర్ తొలగించి కొత్తగా నిర్మించే దిమ్మ వద్దకు మార్చనున్నామని చెప్పారు. సుమారు రూ. 2 లక్షలతో ఎస్టిమేట్ వేశారు. ఉంగుటూరు సబ్ డివిజన్ డిప్యూటీ డీఈ రాళ్లపల్లి భీమేశ్వరరావు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్