ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనవరి 24న గుంటూరులో 10కె రన్

1 రోజు క్రితం

10 krun.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 12:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆరోగ్యం, గుండె పరిరక్షణపై అవగాహన లక్ష్యం

  • 18వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న 10కె వాక్‌

ప్రజాశక్తి - గుంటూరు: ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, గుండె ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా జనవరి 24న గుంటూరులో 10కె రన్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. “ఆరోగ్యం కోసం నడక – గుండె కోసం నడక” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 17 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న 10కె వాక్‌ ఈ ఏడాది 18వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందన్నారు. వివిధ సంస్థలు, ప్రముఖులు, దాతలు, స్పాన్సర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ కన్వీనర్ కోయ సుబ్బారావు తెలిపారు. గుంటూరు వాసులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్