న్యూఢిల్లీ : ప్రతిపక్షాలు సోమవారం సుప్రీంకోర్టుకు ర్యాలీ ప్రదర్శన చేపట్టనుంది. దీంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ సహా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆరు మెట్రోస్టేషన్లను ఉదయం 6.00గంటల నుండి సాయంత్రం 4.00గంటల వరకు మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (డిఎంఆర్‌సి) ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో సోమవారం సమావేశం కావాలంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన అభ్యర్థనను సిజెఐ తిరస్కరించారు. చర్చకు రానున్న అంశాలు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున సమావేశ అభ్యర్థనను తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. పరిపాలనాపరమైన అంశాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని పేర్కొన్నట్లు సమాచారం.
సుప్రీంకోర్టుకు ర్యాలీ చేపట్టనున్న ప్రతిపక్షాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)