సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాస్వామ్య పరిరక్షణకే 'చలో ఢిల్లీ' పిలుపు: డీకే శివకుమార్

1 గంట క్రితం

ఓటు హక్కు అనేది కేవలం రాజకీయ అధికారం మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి జీవించే హక్కుతో సమానమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు.

ఓటు హక్కు అనేది కేవలం రాజకీయ అధికారం మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి జీవించే హక్కుతో సమానమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు.

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై :

ఓటు హక్కు అనేది కేవలం రాజకీయ అధికారం మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి జీవించే హక్కుతో సమానమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) నిరాకరించిన నేపథ్యంలో... ఈ పరిణామాలపై డీకే శివకుమార్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు.


ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వాలు, వ్యవస్థలు వినాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ప్రతిపక్షాల అభ్యర్థనలను పట్టించుకోనప్పుడు, ప్రధానమంతీయే స్వయంగా స్పందించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని హితవు పలకారు. అన్ని మార్గాలు మూసుకుపోవడం వల్లే తాము సీజేఐని కలవాలని నిర్ణయించుకోవాల్సి వచ్చిందని శివకుమార్ వెల్లడించారు.


కాగా, ఎన్నికల సంఘం (ECI) పనితీరును నిరసిస్తూ ‘ఇండియా’ (INDIA) కూటమి ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుండి సుప్రీంకోర్టు వరకు భారీ నిరసన ప్రదర్శన (‘చలో ఢిల్లీ’) జరుగనుంది. సీజేఐ అపాయింట్‌మెంట్ లభించనప్పటికీ, ఈ నిరసన కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నిరసనపై ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. "ప్రజాస్వామ్యం కోసం మార్చ్.. న్యాయం కోసం మార్చ్.. చలో ఢిల్లీ" అంటూ ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు.


ఈ నిరసన మార్చ్ నేపథ్యంలో మధ్య ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా పటేల్ చౌక్, జనపథ్, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బారాఖంబా రోడ్ మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను మధ్యాహ్నం 4:00 గంటల వరకు నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలను భారీగా మోహరించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్