ప్రజాశక్తి- తాడేపల్లి : మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాడేపల్లి బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లంకె సూర్యం తన అనుచరులతో సహా టిడిపిని వీడి శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు సుమారు 30 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్త బుర్రుముక్కు గోపాలసోమిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఈ చేరికలు జరిగాయి.కొత్తగా చేరిన వారికి నియోజకవర్గ సమన్వయకర్త గోపాలసోమిరెడ్డి స్వయంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో రోజురోజుకూ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయని, మంగళగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ అప్పో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిలో టిడిపికి భారీ షాక్
14 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)