ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తహశీల్దార్ ఫిర్యాదుపై కేసు నమోదు

30 సెప్టెంబర్, 2026

mro
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా): తెనాలి తహశీల్దార్ పై అసత్య ఆరోపణలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తులపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రూరల్ గ్రామం కొలకలూరు కు చెందిన కాలిశెట్టి ఫణి కుమార్, పట్టణానికి చెందిన వై.కామేశ్వరరావు సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకొని తన విధులకు ఆటంకం కలిగిస్తూ, సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తూ, రూ.10 లక్షలు డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్లు తహశీల్దార్ గోపాలకృష్ణ ఫిర్యాదు చేశారని తెలిపారు. నిందితులపై నాన్ బెయిలబుల్, ఐటి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేసును పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్