జిల్లా కలెక్టర్, రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఎండీతో ఉన్నతస్థాయి సమావేశం..
ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : 'మురసు' తుఫాను ప్రభావంతో చిలకలూరిపేట మండలంలో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు విచ్చేసిన అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం శనివారం జిల్లా అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. చిలకలూరిపేట మండల పరిధిలో తుఫాను మిగిల్చిన నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన ఈ కేంద్ర బృందంలో సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్, కేంద్ర వ్యవసాయ, రైతు సంఘం ప్రశాంత్ ఆర్మోరికర్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (వ్యయ శాఖ) అసిస్టెంట్ డైరెక్టర్ హిమాలయ గార్గ్, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA) డిప్యూటీ డైరెక్టర్ (DP&T) ప్రణయ్ గార్గ్ ఉన్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు ముందు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్లతో కేంద్ర బృందం సభ్యులు సమావేశమయ్యారు. జిల్లాలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలు, మౌలిక సదుపాయాలు, ఆస్తి నష్టాల వివరాలను కలెక్టర్, అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం బృందం సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరారు.







కామెంట్‌లు (0)