బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాత మల్లయ్యపాలెం గ్రామంలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

1 గంట క్రితం

Cordon and search operation in Pata Mallayyapalem village.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 11:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి : పోలీసు అధికారుల పిలుపు

  • వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ఆపాదించవద్దు : హెచ్చరిక


ప్రజాశక్తి - ప్రత్తిపాడు (గుంటూరు) : గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, సౌత్ డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్తిపాడు సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు ఎస్‌ఐ నరహరి బుధవారం తెల్లవారుజామున పాత మల్లయ్యపాలెం గ్రామంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. గ్రామంలోని అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు ఇతర అంశాలపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను నివారించడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.


సోదరభావంతో మెలగాలి : ఈ సందర్భంగా సౌత్ డీఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలందరూ సోదరభావంతో మెలుగుతూ పరస్పర గౌరవం, సత్సంబంధాలను కొనసాగించాలని సూచించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుతూ, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని, అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, బెదిరింపులకు భయపడకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.


వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టవద్దు :

ప్రత్తిపాడు సీఐ సుబ్బారావు మాట్లాడుతూ.. గ్రామస్థులు తమ వ్యక్తిగత విభేదాలు, పాత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టకూడదని హితవు పలికారు. రాజకీయ అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, పరస్పరం గౌరవించుకుంటూ గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇతరులను రెచ్చగొట్టడం, బెదిరించడం, గొడవలకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వట్టిచెరుకూరు సీఐ బాలకృష్ణ, పెదనందిపాడు, కాకుమాను, నల్లపాడు ఎస్‌ఐలతో పాటు సుమారు 40 మంది సివిల్ మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్