వాటికన్ : పోప్ లియో కు ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స జరిగింది. మంగళవారం సుమారు 90 నిమిషాలపాటు జరిగిన సర్జరీలో ఆయన కుడి ఊపిరితిత్తిపై పెరిగిన కణితిని డాక్టర్లు తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ఆయన మళ్లీ కోలుకున్నట్లు వాటికన్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆ కణితి వల్ల క్యాన్సర్ విస్తరించిందా లేదా అని తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. కుడి ఊపిరితిత్తికి చెందిన కిందభాగంలో పెరిగిన కణితిని తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. డయాగ్నస్టిక్ పరీక్షల్లో పోప్ లియోకు పల్మోనరీ అడినోకార్సినోమా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. సుమారు మూడు గంటల పాటు పోప్ను ఆపరేషన్ రూమ్లో ఉంచారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని, ఎటువంటి ఫిర్యాదులు లేవని వాటికన్ వెల్లడించింది. ప్రోసిజర్ ముగిసిన తర్వాత పోప్ డిన్నర్ రిక్వెస్ట్ చేశారని వాటికన్ వర్గాలు పేర్కొన్నాయి. రోమ్లో ఉన్న గెమేలి ఆస్పత్రి 10వ అంతస్తులో ఆయన కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోనున్నారు. పోప్ నిర్వహించే సామూహిక ప్రార్థనలను అక్టోబర్ 20 వ తేదీ వరకు రద్దు చేశారు. వచ్చే నెలలో జరగనున్న దక్షిణ అమెరికా పర్యటనపై ఇంకా స్పష్టత లేదు.
పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్ - కణితి తొలగింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)