ఎన్నికల ప్రచారంలో అనుచరులకు భోజన ఏర్పాట్లు...
హోటళ్లకు రద్దీ 3 పూటల ఆర్డర్లు..
ఉదయం కిచిడి, పరోట, కబాబు కర్రీ,మధ్యాహ్నం రాత్రి కి మటన్, చికెన్ బిర్యానీలు
ఇదే అదనుగా పరిణామాన్ని తగ్గిస్తున్న హోటళ్ల యజమానులు...
ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : పట్టణంలో ఎన్నికల పుణ్యమా అని ... తినుబండారాల హోటళ్లకు, క్యాటరింగ్ వారికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో రోజువారీగా టిఫిన్ కి సంబంధించి అట్టు, ఇడ్లీ, పూరి తదితర టిఫిన్ కి ఒకసారి డిమాండ్ పెరిగి పరిమాణాన్ని తగ్గించి అమ్ముతున్నారు. దీంతో సాధారణంగా టిఫిన్ చేసే వారు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా హోటల్ కు, టీ కొట్లకు విపరీతమైన రద్దీ పెరిగింది. ఇదే అదనుగా రేట్లు ప్రస్తుతం పెరగకపోయినా పరిమాణాలు తగ్గించి అమ్ముతున్నారని విమర్శలు ఉన్నాయి. అభ్యర్థులు ఉదయం 6 గంటలకు ప్రచారం ప్రారంభిస్తూ ఆయా పార్టీల కార్యకర్తలు, అనుచరులకు టిఫిన్, భోజన సమయానికి రావాలని చెబుతూ అల్పాహార ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం నిత్యం ఒక్క అభ్యర్థికి ఉదయం రూ.100 నుంచి 150 రూపాయల వరకు అల్పాహారం, బిర్యాని మాములు రైస్ అయితే రూ.80 నుంచి రూ.100, చికెన్ తో అయితే రూ.130 నుంచి రూ.150 కి పెంచి మధ్యాహ్నం విరామ సమయం తీసుకుని భోజనానికి రాత్రి గం.10 గంటల సమయంలో ప్రచారం ముగిశాక డిన్నర్ కార్యక్రమాలు ఏర్పాటులో అమ్ముతున్నారు. దీంతో కొన్ని రోజుల నుంచి పట్టణ, నియోజకవర్గ వ్యాప్తంగా హోటల్ కి క్యాటరింగ్ కు ఆర్డర్స్ గిరాకీ పెరిగాయి. అందరికీ భోజనం. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఈ నెల 30 తో ముగియనున్నది. అలాగేఎంపీటీసీ, జడ్పి టిసి,ఎన్నికల ప్రచారం నవంబర్ ఒకటో తారీఖున ముగియనున్నది. ఈ నేపథ్యంలో వారం నుంచి పది రోజుల వ్యవధిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అవకాశం మాత్రమే ఉంది. ఈ సమ యాన్ని అన్ని పార్టీల వారు సాధ్యమైనంత వరకు ఓటర్లందరిని ఇళ్లవద్దకు వెళ్లి కలిసేందుకు అభ్యర్థులు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందు కోసం ప్రాంతాలు వీధులు వారీగా ప్రణాళిక రూపొందించుకొని ప్రచారానికి వెళుతున్నారు. చాలా మంది పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. అక్కడే సమావేశం ఆయా ఏ ప్రాంతంలో ప్రచారం నిర్వ హించాలో నిర్ణయించుకుని ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. ఉదయం ఎంత మంది అక్కడికి వస్తే అంత మందికి అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. కొందరైతే సమీపంలోని హోటల్ నిర్వాహకులకు చెప్పి తమ వాళ్ళకి ఎంత మంది వస్తే ఎంత మంది టిఫిన్ పెట్టాలని చెప్పి బిల్లు చెల్లిస్తామంటున్నా రు. దీంతో పట్టణ నియోజకవర్గ స్థాయిలో మాంసాహార హోటళ్లకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో వారు ఉదయం 6 గంటలకు కిచిడి, కబాబు చికెన్ ఫ్రై కర్రీ వంటి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నారు. చికెన్ రేట్లు కె. జికి 10 రూపాయలు పెరిగి రోజు వారీ సామాన్యులు ఇబ్బందులకు గురౌతున్నారు.







కామెంట్లు (0)