శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్‌...

45 నిమిషాల క్రితం

Police flag march in the run-up to the elections...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 12:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఓటర్లలో భరోసా కల్పించేందుకే కవాతు : జిల్లా ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి


ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా భరోసా కల్పించేందుకు శనివారం నరసరావుపేటలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్ళి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కవాతులో పాల్గొన్న జిల్లా ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ మల్లమ్మ సెంటర్ మీదుగా సత్తెనపల్లి రోడ్డు లోని కోట సెంటర్ వరకు కొనసాగిందన్నారు.జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేలా పోలీసు శాఖ అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన నిఘా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐ లతో పాటు 100 మందికి పైగా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్