శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లాలో 24 మద్యం షాపులకు నోటిఫికేషన్

42 నిమిషాల క్రితం

Notification issued for 24 liquor shops in the district
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 12:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో రెన్యువల్‌ కాని ఓపెన్‌ కేటగిరీకి చెందిన 24 మద్యం షాపులకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మణికంఠ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ షాపులకు సంబంధించి వచ్చే నెల ఒకటో తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌ లైన్‌ లేదా ఆఫ్‌ లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సమీప ఎక్సైజ్‌ స్టేషన్‌ లేదా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్