రెండు నామినేషన్లు తిరస్కరణ...
బొల్లాపల్లి, నాదెండ్లలో ఒక్కొక్కటి తిరస్కరణ...
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 117 నామినేషన్లలో రెండింటిని తిరస్కరించడంతో 115 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంజన శ్రీహర్ష వెల్లడించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన చేపట్టారు. బొల్లాపల్లి, నాదెండ్ల మండలాల్లో ఒక్కొక్క నామినేషన్ ను తిరస్కరించారు. పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు నరసరావుపేట లోని స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జరిగిన నామినేషన్ల పరిశీలనను జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు కన్నబాబు జిల్లాలో పర్యటించి స్క్రూటినీ ప్రక్రియను పరిశీలించారు.







కామెంట్లు (0)