ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : స్థానిక మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులకు ఆదివారం నాడు ఎన్నికల నిర్వహణ జరిగింది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ఏ.ఎం.జి. స్కూల్ లో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అధికారులు భద్ర పరిచారు. నేటి (మంగళవారం )ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌన్సిలర్ అభ్య ర్థుల ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 16 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు మొత్తం మూడు రౌండ్లలో 48 వార్డు ల ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా ఏర్పాట్లను చేశారు. అందులో ఒక్కో రౌండ్‌లో 16 వార్డు ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ఫలితాల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 7 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చైర్‌పర్సన్ అభ్యర్థుల ఫలితాలను ఒకే రౌండ్‌లో వెల్లడించేలా అ ధికారులు ప్రణాళిక రూపొందించారు. మంగళవారం వెలువడనున్న పట్టణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మున్సిపాలిటీ కౌంటింగ్ కు సర్వం సిద్ధం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 03:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)