రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం పలికిన అధికారులు, నాయకులు...
రూ.10.99 కోట్ల రూపాయలతో దేవాలయాల నూతన నిర్మాణాభివృద్ధి పనులకు గవర్నర్ శంకుస్థాపన
ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : బొప్పూడి గ్రామంలో రూ.10.99 కోట్ల రూపాయలతో దేవాలయాల నూతన నిర్మాణాభివృద్ధి పనులకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శంకుస్థాపన చేశారు. గురువారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడి గ్రామానికి విచ్చేసిన గవర్నర్ కు ఉన్నతాధికారులు, అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. రూ.10.99 కోట్ల రూపాయల పనులకు సంబంధించిన ఆలయాల నిర్మాణాలకు ఆయన మండల పరిధిలో గల బొప్పూడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి, శ్రీ మల్లేశ్వర స్వామి పుష్కరిణి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ , పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు , జిల్లా కలెక్టర్ కృతిక శుక్లతో పాటుగా జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు, పట్టణాధికారులు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)