గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉమర్‌ ఖలీద్‌, షార్జిల్‌ ఇమామ్‌ బెయిల్‌ పిటిషన్లను వ్యతిరేకించిన ఢిల్లీ పోలీసులు

1 గంట క్రితం

Khalid, Imam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 01:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్‌ ఖలీద్‌, షార్జిల్‌ ఇమామ్‌ దాఖలు చేసిన మూడో బెయిల్‌ పిటిషన్లను ఢిల్లీ పోలీసులు గురువారం వ్యతిరేకించారు. ఈ పిటిషన్లు చట్టపరంగా నిలబడేవి కావని, తప్పుడు అవగాహనపై ఆధారపడి ఉన్నాయని ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన సమాధానంలో పేర్కొన్నారు. గుల్ఫిషా ఫాతిమా వర్సెస్‌ స్టేట్‌ (ఎన్‌సీటీ ఆఫ్‌ ఢిల్లీ) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుత కేసులో పరిస్థితుల మార్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు ఆరోపించారు. యుఎపిఎ కింద నమోదైన కేసులో తమ మూడో బెయిల్‌ దరఖాస్తులను ట్రయల్‌ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఖలీద్‌, ఇమామ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై గత నెలలోనే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2020 నాటి ఢిల్లీ అల్లర్లకు ఉమర్‌ ఖలీద్‌, షార్జిల్‌ ఇమామ్‌ సూత్రధారులుగా వ్యవహరించారని పోలీసులు తమ సమాధానంలో ఆరోపించారు. గుల్ఫిషా ఫాతిమా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, నిందితులందరి ప్రమాద స్థాయిల (రిస్క్‌ ప్రొఫైల్స్‌) మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖలీద్‌, ఇమామ్‌లను నిర్బంధంలోనే కొనసాగించాలని పోలీసులు వాదించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్