సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Canada - విమాన ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

2 గంటల క్రితం

Plane crash in Canada... two Indian students killed; how did it happen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 01:38 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కెనడా : కెనడాలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. మృతులను తమిళనాడు, పుదుచ్చేరికి చెందినవారు. విమానం శిక్షణ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని వాంకోవర్‌లోని భారత దౌత్యకార్యాలయం వెల్లడించింది. విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు తగిన సాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.


ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి ....

కెనడియన్ బ్రాడ్‌కాస్టర్ CBC ప్రకారం ... హార్వ్స్ ఎయిర్‌కు చెందిన సెస్నా 172 విమానం శుక్రవారం తెల్లవారుజామున సస్కట్చేవాన్‌లోని కిస్బే సమీపంలో కూలిపోయింది. విమానంలో ఉన్న ఇద్దరు ఇండియన్ విద్యార్థులు మృతి చెందారు. మానిటోబాలోని రెజీనా నుండి స్టెయిన్‌బాచ్ వరకు, సస్కట్చేవాన్‌లోని కార్లైల్ సమీపంలో ఆగేలా ప్రణాళికతో ఆ విమానాన్ని రాత్రి వేళ ఉపయోగించారు. తమ కమర్షియల్ పైలట్ లైసెన్సులకు అవసరమైన ఫ్లయింగ్ అవర్స్‌ను సంపాదించుకోవడానికి ఇద్దరు పైలట్లు ఓ విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు పేర్కొంది. విమానం అనుకున్న గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో అది గడువు దాటినట్లు పేర్కొంది.


ఘటన ఎలా జరిగిందంటే ...

స్థానిక కాలమానం ప్రకారం .... సాయంత్రం 6 గంటల సమయంలో గాలింపు చేపట్టారు. సహాయక బృందాలు విమాన శకలాలను గుర్తించాయి. ట్రెంటన్‌లోని జాయింట్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు చెందిన లెఫ్టినెంట్ జోయీ హోలాండర్ మాట్లాడుతూ ... 435 స్క్వాడ్రన్‌కు చెందిన CC-138 హెర్క్యులస్ విమానం ప్రమాద స్థలాన్ని గుర్తించిందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడానికి సాంకేతిక నిపుణులు పారాచూట్ ద్వారా కిందకు దిగారు. గాలింపు, సహాయక చర్యల తర్వాత ఈ కేసును రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్‌కు అప్పగించారు.


గతేడాది జనవరి నుండి హార్వ్స్ ఎయిర్‌కు సంబంధించి ఇది మూడవ ప్రమాదం. ఆ సంస్థకు చెందిన ఫ్లైట్ స్కూల్‌కు చెందిన ఓ ట్రైనర్ విమానం ప్రొపెల్లర్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జూలైలో శిక్షణా విమాన విన్యాసం సందర్భంగా రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థి పైలట్లు మరణించారు. తాజా ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి చెందారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్