శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెవిన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

1 గంట క్రితం

gnt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 01:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : మీరు చేసే తప్పులకు రైతులు ఇబ్బందులు పడాలా అంటూ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రెవిన్యూ ఉప తహసీల్డార్ రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో రైతులకు ఈ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు భూముల రిసర్వేలో జరిగిన తప్పిదాలపై రైతులు ఫిర్యాదు చేశారు.రిసర్వేలో తమ భూములు తగ్గాయని ఎమ్మెల్యే కి వివరించారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రెవిన్యూ సిబ్బంది పై ఆగ్రహించారు. రిసర్వే సక్రమంగా చేస్తున్నారా ‌భూమి ఎందుకు తగ్గుతుంది అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళకుండా ఫ్యాన్లు కింద కూర్చుని పనిచేస్తున్నారని ఆగ్రహించారు. అన్ని గ్రామాల్లో ఈ లాంటి సమస్యలు ఉన్నాయి. వాటిని సరిదిద్దడానికి రైతులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రం వ్యక్తం చేశారు. రైతులకు సమస్యలును త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాకాలపాడు సొసైటీ అధ్యక్షులు కొణికినేని సత్యనారాయణ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఆళ్ళ అమరేశ్వరరావు టిడిపి నాయకులు మక్కపాటి రామచంద్రరావు, కోమటినేని శ్రీనివాసరావు రైతులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్