ప్రజాశక్తి-తుళ్లూరు (గుంటూరు) : రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలం రాయపూడిలో పెరేడ్ గ్రౌండ్ పరిసరాలను అధికారులు బుధవారం పరిశీలించారు. ఆగస్టు 15వ తేదీన జరుగనున్న 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమరావతిలోని మంత్రుల బంగ్లాల వెనుక ఉన్న పెరేడ్ గ్రౌండ్‌లో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) జె. శ్యామలరావు, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ,ఎస్ పి వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశం, క్షేత్రస్థాయి పరిశీలన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్న నేపధ్యంలో ఏర్పాట్ల పురోగతి, భద్రత, ట్రాఫిక్, రహదారుల సదుపాయాలపై శ్యామలరావు అధికారులతో సమగ్రంగా చర్చించారు. పెరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఎటువంటి లోటు పాట్లు లేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, ఇంటెలిజెన్స్ నిఘా,సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలకు వచ్చే విఐపీలు, అధికారులు, సాధారణ ప్రజలకు వేర్వేరుగా వాహన పార్కింగ్ స్థలాలను కేటాయించాలని, ట్రాఫిక్ స్థంభించకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పెరేడ్ గ్రౌండ్‌కు అనుసంధానంగా ఉన్న అన్ని ప్రధాన, అంతర్గత రహదారులను త్వరితగతిన పునరుద్ధరించాలని సి ఆర్ డి ఎ,ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరిసర ప్రాంతాల పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలను జెడ్పి,డి ఆర్ డి ఎ అధికారులు పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. అత్యవసర వైద్య సహాయం కొరకు గ్రౌండ్ వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని డి ఎం హెచ్ వో ను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సి ఆర్ డి ఎ కమీషనర్ కె విజయరామరాజు, అడిషనల్ కమీషనర్ భార్గవ తేజ,జెసి అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగర పాలక సంస్థ కమీషనర్ చేకూరి మయూర్ అశోక్, గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్ పి (ఎల్ అండ్ ఓ)ఎ టి వి రవికుమార్, డి ఎస్ వో కోమలి పద్మావతి, ఆర్ డి వో శ్రీనివాసరావు, ఎపి సిపిడిసిఎల్ ఎస్ ఇ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ.ఈ విశ్వనాథ్ రెడ్డి, జెడ్పి సీఈవో జ్యోతిబాస్, డి ఆర్ డి ఎ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాయపూడిలో పెరేడ్ గ్రౌండ్ పరిసరాలను పరిశీలించిన అధికారులు
05 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 04:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)