శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లంక భూముల రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ ... నిరసన

4 రోజుల క్రితం

Protest demanding resolution of the problems of farmers in Sri Lankan lands
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 02:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : రామచంద్రాపురం, నూతక్కి గ్రామాల లో గల సొసైటీ లంక భూముల పేదల రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రామచంద్రాపురం, నూతక్కి సొసైటీలలో గల లంక భూముల పేద రైతులు మంగళవారం పాయసం కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా రేవేంద్రపాడు పేద లంక భూములను పెత్తందారులు ఆక్రమించుకున్నారంటూ ఆ రైతులు నిరసన వ్యక్తం చేశారు. నూతక్కి మాల టిసిఎస్ సొసైటీ లంక భూముల రైతులు 62 మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేసి రైతు భరోసా, ఎరువులు, విత్తనాలు ప్రభుత్వం అందించాలని కోరారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకురాలు వల్లూరి భారతి, సిఐటియు నాయకులు జెవి రాఘవులు, పలువురు సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ నూతక్కి సొసైటీ ద్వారా 1943లో దళితులకు 62 మందికి ఒక్కొక్క రైతుకి ఎకరం 9 సెంట్లు, ఎకరం 10 సెంట్లు చొప్పున బీఫారాలు ఇచ్చారని అన్నారు. అప్పటినుండి పంటల పండించుకొనుసు జీవించుచున్నారని అన్నారు. 80 సంవత్సరాలు దాటిన తర్వాత పట్టాలు పోయినాయి అని వారసులైన వారికి పట్టాలిచ్చి, పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. రామచంద్రాపురం డి సి టి స సొసైటీలో 130 మంది సభ్యులు ఉన్నారని అన్నారు. వారిలో 65 మందికి పట్టాదార్ పాద పుస్తకాలు ఇచ్చారని, మిగిలిన వారికి ఇవ్వలేదని అన్నారు. వారందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి హెబ్ ల్యాండ్ లో పెట్టి ఆన్లైన్ చేసి వన్ బి అడంగల్ ఇచ్చి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని విన్నవించారు. వరదలు వచ్చి పంటలు నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రేవేంద్రపాడు లంక భూములను పెత్తందారులు ఆక్రమించుకొని వాస్తవ లబ్ధిదారులైన లంక భూముల రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. దౌర్జన్యం చేసిన పెత్తందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లంక భూముల పేద రైతులు ఎస్ ఐజాక్, ఎస్ శ్రీహరి, బి రమేష్, నూతక్కి సొసైటీ ప్రతినిధులు జే వీరయ్య, కే రాధాకృష్ణ, రామచంద్రాపురం డి సి టి సి సొసైటీ ప్రతినిధులు ఎన్ మధుసూదన్ రావు, ఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్