మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్టీసీ ఉద్యోగుల ఒక రోజు నిరాహార దీక్ష

1 గంట క్రితం

RTC employees' one-day hunger strike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 01:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నెల్లూరు-2 డిపోను వెంటనే తెరవాలి...


ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నెల్లూరు-2 ఆర్టీసీ డిపోను మూసివేయడాన్ని నిరసిస్తూ ... ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన ఆందోళన 212 రోజులకు చేరుకున్నా ప్రభుత్వం విధానంలో ఎలాంటి మార్పు రాలేదని స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌-సిఐటియు) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఆర్టీసీ డిపో ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. నెల్లూరు-2 డిపోను వెంటనే పునరుద్ధరించాలని, ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందిస్తున్న ఆర్టీసీని పరిరక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. నిరాహార దీక్షలో అహ్మద్‌ భాష, జి.గోవిందు, జి.వి.నాయక్‌, ఎస్‌.కె.ఎ.కె. జిలాని, పి.ఎస్‌.బాబు, మీరావలి పాల్గొన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నెగంటి రామారావు, సిఐటియు నాయకులు డి.శివకుమారి, సిలార్‌ మసూద్‌, ఎన్‌.కోటేశ్వరరావు పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. రిటైర్డ్‌ యూనియన్‌ నాయకులు మస్తాన్‌రావు, సింగు, వీరారెడ్డి దీక్షకు సంఘీభావం తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్