మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సత్తా చాటిన కానిస్టేబుల్ త్రినాథ్

1 గంట క్రితం

Constable Trinath proves his mettle.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : 1 వ ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో విశాఖ రేంజ్ క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ సాధించడంలో ద్వారకా లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్ వి. త్రినాథ్ కీలక పాత్ర పోషించారు. టోర్నమెంట్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన త్రినాథ్ ఐదు మ్యాచ్‌లలో 253 పరుగులు చేసి, 126 సగటుతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. దీంతో ఆయన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం త్రినాథ్ ప్రతిభను అభినందిస్తూ ద్వారకా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి. ఉమామహేశ్వరరావు ఆయనను అభినందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. పోలీస్ విధులతో పాటు క్రీడా రంగంలోనూ ప్రతిభ కనబరిచి విశాఖ రేంజ్‌కు గౌరవం తీసుకురావడం అభినందనీయమని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్