మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నివాసం ఉన్నచోటే పట్టాలివ్వాలి : సిపిఎం నగర కార్యదర్శి శంకర్రావు

1 గంట క్రితం

Land titles must be issued at the place of residence: CPM City Secretary Shankara Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 01:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

నివాసం ఉన్నచోటే పట్టాలివ్వాలి ..

ఇల్లు లేనివారికి 2 సెంట్లు స్థలం కోరుతూ .... 11 నుండి వార్డు కిపోదాం కార్యక్రమం

ప్రెస్ మీట్ లో సీపీఎం నగరకార్యదర్శి రెడ్డి శంకర్రావు పిలుపు


ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పట్టణoలో పేదలు నివాసం ఉన్నచోటే పట్టాలిచ్చి ఇల్లు కట్టాలని, జిఓ నెంబర్ 30 అమలు చెయ్యాలని సీపీఎం పార్టీ విజయనగరం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం ఎల్ బి జి భవన్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో రెడ్డి శంకరరావు మాట్లాడుతూ .... గత 18 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎల్ బి జి నగర్, రామకృష్ణ నగర్, వినాయక నగర్, గురజాడ నగర్, జొన్న గుడ్డి, బుంగ వీదీ, గంజిపేట, గోడగల వీదీ పేదలకి తక్షణమే పట్టాలిచ్చి ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జిఓ నెంబర్ 30 ప్రకారం నగరంలో పేదలు నివాసం ఉన్నచోటే పట్టాలిచ్చి ఇల్లు నిర్మించాలని కోరారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పట్టణంలో ఇల్లు లేని పేదల కి 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని అన్నారు. వేలాది మంది యువకులు వివాహాలు అయ్యి, పిల్లలు ని కని ఇల్లు లేక పడుతున్న ఇబ్బందలు, అద్ది కట్టలేక, వచ్చిన కూలి సరిపోక పడుతున్న ఇబ్బదులు అన్ని ఇన్ని కావని, అన్నారు. ఇల్లు లేని పేదలకి రెండు సెంట్లు స్థలం ఇవ్వ లేదంటే పేదలు పోరాడాల్సి వస్తుందని ఆ పోరాటానికి సీపీఎం ముందుంటున్నదని అన్నారు. అలాగే ఇల్లు, ఇళ్ల స్థలాల సమస్యలు పై 11 వ తేదీ నుండి వార్డుకి పోదాం.. ప్రజాసమస్యలు తెలుకుందామని కార్యక్రమం సీపీఎం చెపడుతుందని ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని శంకరరావు పిలుపు నిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి. రమణమ్మ,నగర కమిటీ సభ్యులు బి. రమణ. వి.లక్ష్మి, రంభ శ్రేనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్