కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీ..
కేసులో కీలక వివరాలపై పోలీసుల విచారణ
ప్రజాశక్తి-కాకినాడ రూరల్ : సంచలనం సృష్టించిన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సాధిక్ ఖాన్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో సర్పవరం పోలీసులు సాధిక్ ఖాన్‌ను తమ కస్టడీకి తీసుకుని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇటీవల సాధిక్ ఖాన్‌ను కస్టడీకి ఇవ్వాలని సర్పవరం పోలీసులు కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. కస్టడీలో భాగంగా సాధిక్ ఖాన్‌ను పోలీసులు వివిధ అంశాలపై విచారించనున్నారు. ముఖ్యంగా కేసుకు సంబంధించిన కీలక విషయాలు, ఘటనల వెనుక ఉన్న పరిణామాలు, ఇతర వ్యక్తుల ప్రమేయం తదితర అంశాలపై పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సాధిక్ ఖాన్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో పోలీసులు పలు కీలక అంశాలను వెలుగులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. తాజాగా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోవడంతో దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. మూడు రోజుల కస్టడీ అనంతరం పోలీసులు సేకరించే వివరాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.






కామెంట్‌లు (0)