ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ (గుంటూరు) : గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతక్కి జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా, బాపట్ల, పల్నాడు జిల్లాల అండర్ 17 కబడ్డీ పోటీలలో ఎం టి ఎం సి పరిధిలోని వడ్డేశ్వరం జడ్పీ హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి చదివే ఎస్. హేమలత ఉత్తమ ప్రతిభను కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థినికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు మెల్లెంపూడి రవి, నూతక్కి రవిలను పాఠశాల విద్య కమిటీ చైర్మన్ బిబి అమీన్ ఎస్.కె, గ్రామ పెద్దలు కాట్రగడ్డ మధుసూదనరావు, మాజీ సర్పంచ్లు షేక్ చినరంగ షరీఫ్, ఈ పూరి కోటయ్య తదితరులు అభినందించారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపి, స్కూల్ కు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు వడ్డేశ్వరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని ఎంపిక
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)