బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫ్యూచర్‌ సిటీలో అమెజాన్‌ కొత్త డేటా సెంటర్‌కు సిఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన

2 గంటల క్రితం

hyd cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 04:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌: ఫ్యూచర్‌ సిటీలో అమెజాన్‌ కొత్త డేటా సెంటర్‌కు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  అమెజాన్‌ డేటా సెంటర్‌ ఫ్యూచర్‌ సిటీలో కీలక పాత్ర పోషించనుందని అన్నారు.  అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని, ఇక్కడ మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది మా లక్ష్యమని, 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని చేరుకుంటామని అన్నారు. ఐఎస్‌బీ, నల్సార్‌ సహా అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, పారిశ్రామికవేత్తలకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఓఆర్‌ఆర్‌, విమానాశ్రయం, ఫార్మా కంపెనీలు అనేక సేవలు అందిస్తున్నాయని, అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ మారనుందని అన్నారు. పరిశ్రమలు, టూరిజం, క్రీడా నైపుణ్యం, వైద్య రంగాల్లో పాలసీలు తెచ్చామని, హైదరాబాద్‌లోని 3వేల ఆర్టీసీ బస్సులు, 2లక్షల ఆటోలను ఈవీలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్‌లో జీరో ట్యాక్స్‌ అమలు చేస్తున్నామని వెల్లడించారు. గొప్ప నగరంగా మారాలనే లక్ష్యంతో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ చేపట్టామని అన్నారు. ఫార్మా పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తీసుకెళ్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లో కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.  


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్