ప్రజాశక్తి - కడియం : తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి.కోమలను ఎ.పి.జి.ఇ.ఎ తూర్పుగోదావరి జిల్లా నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఎఎన్ఎంలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అదనపు పనుల భారం లేకుండా ఒత్తిడి లేని ఉద్యోగ నిర్వహణకు సహకరించాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా గుర్తింపు సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి, సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి న్యాయబద్ధమైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సిహెచ్.ఎస్.విల్సన్ పాల్, సంయుక్త కార్యదర్శి ఎం.వి.బి.రామకృష్ణ, టి.మణిశ్రీ తాలూకా నాయకులు ఎం.వి.ఎన్ ప్రసాద్, పి.మురళి కృష్ణ, డా.ఎన్.ఎన్.ఎస్.మౌర్య కె.ఎన్.మూర్తి, వి.ఉమా మహేశ్వరి, మాణిక్యం, పి.చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి: ఎపిజిఇఎ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 15, 2026, 04:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)