ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెత్తందారులు దౌర్జన్యంగా కడుతున్న ఇల్లును తొలగించాలి
సిపిఎం ఆధ్వర్యంలో బామిని తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
ప్రజాశక్తి- పార్వతిపురం మన్యం : పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో కొసరలీలో ఉన్న దళితులు, పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం తిరుపతి రావు గారు మాట్లాడుతూ.. కొసలిలో సర్వేనెంబర్ 153 లో 12 ఎకరాల 20 సెంట్లు భూమి ప్రభుత్వ గయాలు ఉన్నదని, ఈ భూమిని కొసలీలో ఉన్న కొంతమంది భూములు ఉన్న పెత్తందారులు తమ ఇష్టానుసారం ఆక్రమించుకున్నారని అన్నారు. గ్రామ సచివాలయం ముందు అడ్డంగా ఇల్లు కట్టుకున్న స్పందించని రెవెన్యూ అధికారులు దళితులు, పేదలు ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారని, ఇది దుర్మార్గమని అన్నారు. కొసలిలో గత ప్రభుత్వ హయాంలో అన్ని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు సేకరించిన ఈ గ్రామంలో దళితులకు ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదని, ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ ఇంటిపట్టా ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా మండల తాసిల్దార్ గ్రామములోకి వచ్చి అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిన పెత్తందారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూముల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న దళితులు, పేదలకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేకుంటే పేదలందరినీ కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తాసిల్దార్ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ తాసిల్దార్ కార్యాలయం బయటకు వచ్చి అర్హులైన వారికి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, పెత్తందారుల ఆక్రమించిన ప్రభుత్వ భూములు నుండి వారిని తొలగిస్తామని, వెంటనే గ్రామంలో దండోరా వేయిస్తామని హెచ్చరించారు. సోమవారం 20వ తేదీన గ్రామం లో ప్రభుత్వ పరిశీలనకు వచ్చి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, దీంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించామని అన్నారు. పాలకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ,సీతంపేట, బత్తిలి సబ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ కొప్పర్ మిన్నారావు, సిఐటియు నాయకులు, పేదలు పాల్గొన్నారు







కామెంట్‌లు (0)