ప్రజాశక్తి-గుంటూరు : దేశాభివృద్ధిలో ఎన్ఎస్ఎస్ పాత్ర చాలా కీలకం అని టిజెపిఎస్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ బి.వి.హెచ్. కామేశ్వర శాస్త్రి అన్నారు. శుక్రవారం జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థి దశలో తప్పనిసరిగా ఏదో ఒక ప్రత్యేకమైన రంగంలో ప్రవేశించాలని, విద్యతోపాటు సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకునే సువర్ణమైన అవకాశం జాతీయ సేవా పథకం ద్వారా లభిస్తుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు నాయకత్వ లక్షణాలతో పాటు సమాజంలో విభిన్న మనస్తత్వాలు కలిగిన మనుషుల భావాలు గ్రహించవచ్చని, సమాజంతో మమేకమయ్యే అవకాశాలను ఈ పథకం ఇస్తుందన్నారు. జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ నోడల్ అధికారి డాక్టర్ జమ్ము వెంకటసుధీర్ కుమార్ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటి సంరక్షించడం, ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్యం అవగాహన, పర్యావరణ పరిరక్షణకు అవగాహన వంటి అనేక కార్యక్రమాలు చేపట్టటం జరుగుతుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం పోటీలు నిర్వహించి, విజేతలకు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ప్రోగ్రాం అధికారి ఆర్.జయశైలజ, ఇంటర్మీడియట్ ఇన్‌చార్జ్ జి.సురేష్ కుమార్, వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలు వర లక్ష్మి ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో ఎన్ఎస్ఎస్ పాత్ర చాలా కీలకం
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 08:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)