- చిన్న సమస్యపై కూడా దృష్టి సారించని అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
ప్రజాశక్తి-తెనాలిరూరల్: తెనాలి: స్థానిక రెండో వార్డు హయ్యర్‌పేటలో గ్రంథాలయం ఎదురుగా ఉన్న చేతిపంపు రెండు నెలలుగా పనిచేయక నిరుపయోగంగా మారింది. ఒకప్పుడు ఎంతోమంది స్థానికుల దాహార్తిని తీర్చిన ఈ చేతిపంపు మూగబోవడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చేతిపంపు మరమ్మతులు చేయాలని మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య చిన్నదే అయినా, ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారిందని వారు మండిపడుతున్నారు. కూటమి పాలనలో తాగునీటి వంటి మౌలిక సదుపాయాల విషయంలోనూ నిర్లక్ష్యం కొనసాగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన చేతిపంపు రెండు నెలలుగా పనిచేయకపోయినా సంబంధిత అధికారులు కనీసం మరమ్మతులు చేయించకపోవడం పాలనా తీరుపై విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చేతిపంపునకు మరమ్మతులు చేపట్టి ప్రజల దాహార్తిని తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)