శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతిలో జోరువాన

2 రోజుల క్రితం

అమరావతిలో జోరువాన image 1

తుళ్లూరు - గుంటూరు రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెల్లవారుజామున మొదలై.. కొద్దిసేపు విరామం.. అనంతరం కుండపోతగా కురుస్తున్న వర్షంతో రాజధాని అమరావతిలో రోడ్లు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుళ్లూరులోని ప్రధాన రహదారిపై నీరు పెద్దఎత్తున ప్రవహించింది. సైడ్ కాల్వలు పొంగి నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాలు వద్ద ఎగువ నుంచి వచ్చిన నీరు రోడ్డుపై గంటలపాటు నిలిచి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా వినాయక నిమజ్జనం కార్యక్రమం ఇబ్బందికరంగా మారింది. వర్షంలోనే ఊరేగింపు జరపాల్చి వచ్చింది. సచివాలయం, హైకోర్టు, సిఆర్‌‌డిఎ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఇళ్లకు చేరడానికి నానా అవస్థలు పడ్డారు. బస్సులు, ఆటోలు సమయానికి రాకపోవడంతో బైకుల మీద తడుస్తూ ఇళ్లకు చేరుకున్నారు.

నిర్మాణ పనులకు ఆటంకం..

వర్షం కారణంగా రాజధాని నిర్మాణ పనులకు ఇబ్బంది ఏర్పడింది. ప్రధానంగా మట్టితీత పనులు నిలిచిపోయాయి. రైతుల ఎల్‌పిఎస్ ప్లాట్లలో నీరు చేరడంతో పనులు కొనసాగించేందుకు వీలులేకుండా పోయింది. భారీ వాహనాలు మట్టిలో కూరుకుపోయే అవకాశం ఉండడంతో పనులను తాత్కాలికంగా నిలిపేశారు. వర్షాలు తగ్గాక నీరు తరలింపుకు చర్యలు తీసుకుంటామని, అనంతరం యథావిధిగా పనులు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.

రైతుల ప్లాట్లలో చేరిన నీరు..
ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్