బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్సాహంగా రెడ్ రిబ్బన్ 5కె మారథాన్

1 గంట క్రితం

ఉత్సాహంగా  5 కె  మారథాన్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 05:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ఇంటర్నేషనల్ యూత్ ఫెస్ట్–2026లో భాగంగా “ రన్ ఫర్ హెల్త్ ఇయర్ హెచ్ఐవి ఫ్రీ టుమారో” అనే సందేశంతో రెడ్ రిబ్బన్ 5కే మారథాన్‌ను బుధవారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి ప్రారంభమైన 5కే మారథాన్ హుకుంపేట మండలం బర్మన్నగూడ వరకు కొనసాగింది. ​యువతలో హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, పరీక్షల ప్రాధాన్యత, బాధితుల పట్ల వివక్ష నిర్మూలన, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. 17 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఈ అవగాహన పరుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.


యువతకు హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించారు. సురక్షితమైన పద్ధతులు పాటించడం, ప్రమాదకర ప్రవర్తనకు దూరంగా ఉండటం, హెచ్ఐవీ పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం, హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి సహకారం, మద్దతు అందించడం వంటి అంశాలను వివరించారు. యువతను హెచ్ఐవీ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. మారథాన్ విజేతలకు కలెక్టర్ నిశాంతి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేతలందరినీ అభినందిస్తూ, యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. రెడ్ రిబ్బన్ 5కే మారథాన్ ద్వారా యువతలో ఆరోగ్యంపై అవగాహన, క్రీడాస్ఫూర్తి, సామాజిక బాధ్యతతో పాటు హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అపోహలు, తొలగించాల్సిన అవసరంపై బలమైన సందేశాన్ని అందించారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్