తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై చీటింగ్ కేసు నమోదైన నేపథ్యంలో బుధవారం పట్టణ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. శివకుమార్‌ను సిఐ సిహెచ్.రాంబాబు దాదాపు మూడు గంటల పాటు విచారణ చేశారు. శివకుమార్‌పై విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొద్ది రోజుల క్రితం చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. పట్టణంలో 1200 గజాల స్థలాన్ని ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన శివకుమార్ రూ.3 కోట్లు రుణం పొందారు. అది క్రమంగా తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ విచారించింది. దానిలో భాగంగా వాస్తవానికి కంపెనీలో తాకట్టు పెట్టిన 1200 గజాలలో 700 గజాలు మాత్రమే ఉన్నట్లు నిర్థారించారు. ముందుగానే విక్రయించిన 500 గజాల స్థలాన్ని కూడా కలిపి రుణం పొందినట్లు తేలడంతో కంపెనీ ప్రతినిధులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన వెంటనే శివకుమార్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు తోసిపుచ్చడంతో యాంటీసిటరీ బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ‘నాట్ టు అరెస్ట్ కోఆపరేట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్’ అని ఆదేశించడంతో శివకుమార్ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు అనేక విషయాలపై ప్రశ్నించామని, కొన్ని స్పష్టమైన సమాధానాలు రాగా, కొన్నింటికి తదుపరి విచారణలో వెల్లడిస్తామని శివకుమార్ బదులిచ్చినట్లు తెలిపారు. లోతైన విచారణకు సంబంధించి ఈనెల 16న మరలా స్టేషన్‌కు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందజేసినట్లు సిఐ తెలిపారు. ఎన్నికలవేళ విచారణ పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. మరి 16న విచారణలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
పోలీస్‌స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే శివకుమార్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)