బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎం టి ఎం సి ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ జారీ..

14 నిమిషాల క్రితం

ఎం టి ఎం సి ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ జారీ.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 06:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి మంగళగిరి

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థకు రెండో విడత ఎన్నికలు జరిపేందుకు ఈనెల 26వ తేదీన జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించిన జరిగింది. ఈ మేరకు 13వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ లిస్టు, పోలింగ్ బూతుల లిస్టు, రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2014 మార్చిలో మంగళగిరి, తాడేపల్లి పట్టణాలకు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీల జరిగాయి. రెండు మండలాల్లో గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 2021 మార్చి 23వ తేదీన ఆనాటి వైసిపి ప్రభుత్వం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థను ఏర్పాటు చేసింది. మంగళగిరి, తాడేపల్లి పట్టణాలతో పాటు రెండు మండలాల్లో 21 గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వీలిన గ్రామాలకు సంబంధించిన వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో ఎన్నికలు నిలిచిపోయాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ కూటమి అధికారంలోకి వస్తే రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అయితే వైసిపి ప్రభుత్వ హయాంలో చేసిన కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. కోర్టులో ఉన్న కేసులన్నిటిని ప్రభుత్వం క్లియర్ చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు రెండో విడత ఎన్నికలు నిర్వహించడానికి కమిషనర్ నిర్ణయించినట్లుగా తెలిసింది.

అందులో భాగంగా ఇప్పటికే గతంలో 50 డివిజన్లు ఉండగా, వాటిని 62 చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ లిస్టులను, పోలింగ్ కేంద్రాల లిస్టులను, రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగింది. మేయర్ పదవి ఎస్టీ జనరల్ కు కేటాయించడం జరిగింది. వార్డుల రిజర్వేషన్లు ఎస్టీ జనరల్ ఒకటి, ఎస్టి మహిళ ఒకటి, ఎస్సీ జనరల్ 7, ఎస్సీ మహిళా 6, బీసీ జనరల్ 8, బీసీ మహిళ 8, జనరల్ మహిళ 16, అన్ రిజర్వ్డ్ 15 కేటాయించడం జరిగింది. మొత్తం 62 వార్డుల్లో గాను 2,37,711 ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,14,353 ఓటర్లు, మహిళలు 1,23,350 మంది ఉన్నారు. 261 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ అధికారులు సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు 2014 మార్చి తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయి.మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ మేయర్ పదవి ఎస్టి జనరల్ రిజర్వేషన్ జరిగింది.

​

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్