ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య....

14 నవంబర్, 2026

కౌలు రైతు ఆత్మహత్య 
ప్రజాశక్తి - తాడికొండ (గుంటూరు జిల్లా ) image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 09:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తాడికొండ (గుంటూరు జిల్లా )

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన తూమాటి గోవింద్ (39) ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట సాగు చేశారు. అధిక వర్షాల కారణంగా పంట దక్కకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీ భారం అధికమైంది. అప్పు తీరే దారిలేక శుక్రవారం రాత్రి తన ఇంట్లో గడ్డిమందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. సుమారు ఐదు లక్ష‍ల మేర అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్