ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లలిత ఇన్‌‌స్టిట్యూట్‌‌లో ఉచిత పీడియాట్రిక్‌ ఓపి విభాగం

14 నవంబర్, 2026

లలిత ఇన్‌‌స్టిట్యూట్‌‌లో ఉచిత పీడియాట్రిక్‌ ఓపి విభాగం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 09:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు

స్థానిక లలిత పివిఎస్‌ ఇన్‌‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌‌లో చిన్నారుల కోసం ఉచిత పీడియాట్రిక్‌ అవుట్‌ ‌పేషెంట్‌ ‌విభాగాన్ని ప్రారంభించారు. 1 నుండి 15 సంవత్సరాలు గల పిల్లలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు, నిపుణుల వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హాస్పిటల్‌ ‌చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌పి.వి.రాఘవశర్మ తెలిపారు.అంతర్జాతీయ డయాబెటిస్‌ ‌సమాఖ్య గణాంకాల ప్రకారం సౌత్‌ ఈస్ట్‌ ఆసియా దేశాల్లో టైప్‌ 1 ‌మధుమేహంతో బాధపడుతున్న పిల్లల్లో అత్యధిక సంఖ్య భారత దేశంలోనే నమోదు అవుతుందన్నారు. 0-14 ఏళ్ల వయస్సు గల ప్రతి లక్ష మంది పిల్లల్లో ముగ్గురికి ఏటా కొత్తగా టైప్‌-1 ‌డయాబెటీస్‌ ‌వస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. ఈ ఉచిత అవుట్‌‌పేషెంట్‌ ‌విభాగం సోమవారం నుండి శనివారం వరకూ ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, జనవరి 5వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ విభాగం ద్వారా పిల్లలకు సాధారణ వైద్య పరీక్షలు, ఎదుగుదల, అభివృద్ధి అంచనా, టీకాలపై అవగాహన, ఇన్‌‌ఫెక్షన్లకు చికిత్స, మధుమేహం, కంటి, దంత సమస్యలు, తలనొప్పి, ఆటిజం సమస్యలకు స్క్రీనింగ్‌ ‌పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్