ప్రజాశక్తి - మంగళగిరి
పట్టణంలో 18,19,34 వార్డులకు కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ఎంటిఎంసి కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేస్తారని పార్టీ గుంటూరు జిల్లా నాయకులు ఎస్.ఎస్.చెంగయ్య శనివారం తెలిపారు. వైసిపితో అవగాహన, సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థులుగా 18వ వార్డు కార్పొరేటర్ గా ఉయ్యాల తిరుపతమ్మ, 19 వ వార్డు కార్పొరేటర్‌గా వి.వి.జవహర్‌లాల్, 34వ వార్డు కార్పొరేటర్ గా పిల్లలమర్రి బాలకృష్ణ పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. నామినేషన్ల కార్యక్రమానికి సిపిఎం సభ్యులు, అభిమానులు, సిపిఐ, వైసిపి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
18 వార్డులో ప్రచారం
18 వ వార్డు కార్పొరేటర్ గా సిపిఎం అభ్యర్థి ఉయ్యాల తిరుపతమ్మ నామినేషన్ కార్యక్రమానికి అవార్డు ప్రజలు తరలిరావాలని కోరుతూ శనివారం రాత్రి 18 వ వార్డులో సిపిఎం ప్రచారం నిర్వహించింది. అమరజీవి తుపాకుల సుబ్బారావు విగ్రహం వద్ద నుండి ప్రచారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు ఎస్.ఎస్.చెంగయ్య, సిపిఎం పట్టణ నాయకులు ఎస్.గణేష్, డివైఎఫ్ఐ నాయకులు ఎస్.వెంకటేష్, పాలపర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)