ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జవ్వాజి అనితకు డాక్టరేట్‌

15 నవంబర్, 2026

జవ్వాజి అనితకు డాక్టరేట్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 10:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో పరిశోధన చేసిన విశాఖకు చెందిన జవ్వాజి అనితకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్‌డి) డిగ్రీ ప్రదానం చేశారు. ఉపాధ్యాయ శిక్షణార్థుల జీవిత నైపుణ్యాలు, వారి సర్దుబాటు సామర్థ్యం, బోధనా నైపుణ్యాల మధ్య ఉన్న సంబంధాలపై ఆమె చేసిన పరిశోధనకు విశ్వవిద్యాలయం గుర్తింపు ఇచ్చింది. 'లైఫ్ స్కిల్స్ ఆఫ్ టీచర్ ట్రైనీస్ ఇన్ రిలేషన్ టు దేర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ టీచింగ్ స్కిల్స్' అనే అంశంపై జవ్వాజి అనిత పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. విద్యా విభాగానికి చెందిన డాక్టర్ ఎం.ఎస్తేర్ సునీల పర్యవేక్షణలో ఈ పరిశోధనను పూర్తిచేశారు. ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో జీవిత నైపుణ్యాలు, వ్యక్తిగత, వృత్తిపరమైన పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే సామర్థ్యం, బోధనా నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలను పరిశోధనలో విశ్లేషించారు. ఆమె సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన పరీక్షకుల కమిటీ పిహెచ్‌డీ డిగ్రీ ప్రదానానికి సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆమోదం తెలిపారు. దీంతో జవ్వాజి అనితకు పిహెచ్‌డి డిగ్రీ ఖరారైంది. ఈ సందర్భంగా పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన అనితను, పర్యవేక్షకురాలు డాక్టర్ ఎం.ఎస్తేర్ సునీలను విద్యా విభాగం అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్