ప్రజాశక్తి -ప్రత్తిపాడు
జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకూ నిర్వహిస్తున్న ‘సురక్షిత బాల్యం - బాలల రక్షణ ఉద్యమం’లో భాగంగా ప్రత్తిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎల్.గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ రాజ్యాంగం అందించిన బాలల హక్కులు, పౌరులుగా వారి బాధ్యతలను వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు, ప్యానల్ అడ్వకేట్లు పిల్లి బలరాముడు, కె.శ్రీనివాస్, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)