మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం : గుంటూరు జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌‌వర్మ

6 రోజుల క్రితం

తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం
74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు : గుంటూరు జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌‌వర్మ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలకు అక్వాన్‌ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, ప్రజలు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. తుపాను ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై కలెక్టరేట్‌లో ఆయన మీడియాకు మంగళవారం వివరించారు. చెన్నయ్‌ నుంచి కాకినాడ మధ్య తుపాను తీరందాటే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ముందునుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధమైందన్నారు. గత తుపానుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రాణ, ఆస్తి నష్టాలను వీలైనంతగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 20, 21వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందని, ఇళ్లలోకి వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, పంటలకు నష్టం వాటిల్లకుండా ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి, తహశీల్ధార్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ రైతుల నుంచి అభిప్రాయాలు, సమస్యలపై ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు వివరించారు. 74 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, సుమారు 10 వేల మందికి వసతి కల్పించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. 24వ తేదీ వరకు ప్రసవ తేదీలు ఉన్న గర్భిణులను గుర్తించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి సురక్షిత వసతి కల్పించాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని అధికారుల్ని ఆదేశించామని చెప్పారు. పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు తక్షణమే తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్‌‌కె.ఖాజావలి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్