ప్రజాశక్తి మంగళగిరి
బిసి సంక్షేమ సంఘం నిర్మాణమే రాజ్యాధికారానికి సోపానమని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా విస్తృత స్థాయి సదస్సు నిర్వహించారు. అనతరం కేసన విలేకరులతో మాట్లాడుతూ బిసి139 కులాల ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అవసరతలు, ఆకాంక్షల మేరకు సంఘ నాయకులు- కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలన్నారు. పలు జాతీయ, రాష్ట్రస్థాయి సమస్యలపై, ఉన్నత స్థాయి కమిటీలు ఇచ్చే ఉద్యమ పిలుపులందుకొని తమ ప్రాంత బిసి సమాజాన్ని చైతన్య పరిచి ఎప్పటికప్పుడు పోరాటాలకు సిద్ధపరచాలన్నారు. జనాభా దామాషా మేరకు స్థానిక- చట్టసభలు, ఇతరిత్రా అన్నింటా స్థానాలు కల్పించాలన్నా, సముచిత రాజకీయ ప్రాధాన్యత పెరగాలన్నా, ముందుగా మన సంఘ బలోపేతం మీదే ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు పారేపల్లి మహేష్, రాష్ట్ర అధికార ప్రతినిధులు బాదుగున్నల శ్రీనివాస్, శివరాం బాబాజీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోలా అశోక్, రాష్ట్ర నాయకులు వాకా వెంకటేశ్వర్లు,పూర్ణచంద్రరావు, బొలగాని వెంకట శివరావు గౌడ్, విజయవాడ నగర అధ్యక్షులు చిప్పాడ చందు, మంగళగిరి అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులు వెంకటకృష్ణ ప్రసాద్, దానా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)