ప్రజాశక్తి- తాడేపల్లి
ఎంటిఎంసి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి, సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థి గాదే కోటేశ్వరి మంగళవారం నిర్వహించిన ఇంటింటా ప్రచారానికి విశేష స్పందన లభించింది. ప్రతి ఒక్క ఓటర్‌ను ప్రత్యక్షంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గ్రామంలో గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుని తనకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మేయర్ ఓటు ఫ్యాను గుర్తు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిపిఎం కార్యాలయం వెనుక భాగం, గంగానమ్మ గుడి ప్రాంతం, శివాలయం ప్రాంతంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు క్యాంపియన్ నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల సానుకూలమైన స్పందన వ్యక్తమవుతోంది. గడపగడపకు ప్రచారం చేరుతుంది. తప్పనిసరిగా సిపిఎం, వైయస్సార్సీపి అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, వేముల దుర్గారావు, గంజి శ్రీనివాసరావు, జి.అంజిరెడ్డి, డి.విజయబాబు, ఎం.శ్రీనివాసరెడ్డి, వై.బర్నబాస్, డి.వి.భాస్కర్ రెడ్డి, కె.మేరీ, ఎన్.దుర్గారావు, వి.శాస్త్రి, కె.ఉష, ఎస్.కె.సుభాని, ఎం.డి.బాబ్జి, బి.దశరథరామిరెడ్డి, బి.గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)