గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

3 గంటల క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 09:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తెనాలిరూరల్ : మండల పరిధిలోని కఠెవరం గ్రామం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే, కంఠంరాజు కొండూరు ప్రాంతానికి చెందిన దంపతులు శ్రీనివాసరావు, ఆయన భార్య తెనాలి వైపు వస్తుండగా కఠెవరం గ్రామం వద్ద AP07Z 0426 నంబరు గల ఆర్టిసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడగా, అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆర్టీసీ బస్సు నడుపుతున్న కాంట్రాక్టు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ఘటన స్థలం వద్ద చేరుకున్న కుటుంభ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్