ప్రజాశక్తి-కాకినాడ : ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లద్ధిదారులకు ఆదివారం తన కార్యాలయంలో రూ.29,39,480 విలువైన 17 సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సిఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. పేద కుటుంబాల కష్టాలను తన కుటుంబ సమస్యగా భావించి, వారికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని లబ్ధిదారులకు చేరవేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయానికి లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఎంపీ సానా సతీష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
రూ.29.39 లక్షల విలువైన 17 సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 04:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)